అఖండ 2 నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Powerful First Single from Akhanda 2 Unveiled

ఈఏడాది చివర్లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా వస్తుంది అఖండ 2 .నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈసినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా ఈసినిమానుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాట లాంచ్ ఈవెంట్‌ ముంబైలోని పీవీఆర్ జుహు థియేటర్‌లో జరిగింది. ఈవెంట్ కి బాలకృష్ణ తోపాటు మిగితా టీం హాజరైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఫస్ట్ సింగిల్ సూపర్ అనిపించేలావుంది. ఈ పాటను ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్ మరియు కైలాష్ ఖేర్ , దీపక్ బ్లూ పాడగా కళ్యాణ్ చక్రవర్తి రచించారు.ఈ పవర్ ఫుల్ డివోషనల్ సాంగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. ఈ సినిమాను తెలుగుతో పాటు నార్త్ ఆడియన్స్ టార్గెట్ గా తెరకెక్కిస్తున్నారు. దాంతో ప్రమోషన్స్ కూడా అక్కడి నుండే స్టార్ట్ చేశారు.

అఖండ 2 లో సంయుక్త మీనన్ ,హర్షాలీ మల్హోత్రా , ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించగా బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారు.14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.డిసెంబర్ 5న ఈసినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదలకానుంది. మరోవైపు అఖండ నుండి అపజయమే లేకుండా కొనసాగుతున్నారు బాలకృష్ణ. మరి అఖండ 2తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటారో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.