చార్మింగ్ స్టార్ శర్వానంద్ బైకర్ తో రానున్నాడు. ఇందులో శర్వా సరికొత్త లుక్ తో మోటార్‌సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రం పూర్తయ్యే దశకు చేరుకుంది. రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమానుండి ఫస్ట్ సింగిల్ రానుంది.అందులో భాగంగా నిన్న ప్రోమో ను రిలీజ్ చేశారు. డ్యాన్స్ నెంబర్ గా రానున్న ఈసాంగ్ ను మోనికా ఫేమ్ సుబ్లాశిని , గిబ్రాన్ , యాసిన్ నిజార్ పాడగా కృష్ణ కాంత్ రచించారు. రేపు ఫుల్ సాంగ్ రానుంది.1990, 2000 బ్యాక్ డ్రాప్ లో సాగే బైకర్ రేసింగ్ యాక్షన్ తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కుతుంది ఈసినిమా.
ఈచిత్రంలో ప్రముఖ నటుడు డా .రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనుండగా మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుంది. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ జె. యువరాజ్, మ్యూజిక్ జిబ్రాన్, అనిల్ కుమార్ పి ఎడిటర్.రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. బైకర్ డిసెంబర్ 6న థియేటర్లోకి రానుంది.అయితే ఈ సినిమాకు సరిగ్గా ఒక్క రోజు ముందు అఖండ 2 విడుదలవుతుంది. దాంతో బైకర్ కు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























