నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా-  మంత్రి కొండా సురేఖ  

Minister Konda Surekha Withdraws Comments Made on Nagarjuna’s Family

తెలంగాణ మంత్రి కొండా సురేఖ, సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం గురించి గతంలో చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. ఈ విషయంలో  ఆమె అర్ధరాత్రి సమయంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కొండా సురేఖ తెలిపారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం  చేస్తూ నా  వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని నిన్న అర్థరాత్రి 12:02గంటలకు ఎక్స్ లో ట్వీట్ చేశారు.ఇక  కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన విచారణ నాంపల్లి ప్రత్యేక కోర్టులో రేపు జరగనుంది.ఈ నేపథ్యంలో, విచారణకు ఒక్క రోజు ముందు మంత్రి క్షమాపణలు చెప్పడం గమనార్హం.

2024 అక్టోబర్ 1వ తేదీన, మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు గుప్పిస్తూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల సందర్భంగా ఆమె నటి సమంత పేరును కూడా ప్రస్తావించారు, తద్వారా అక్కినేని కుటుంబాన్ని ఈ వివాదంలోకి తీసుకువచ్చారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తమ కుటుంబాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని భావించిన సినీ నటుడు అక్కినేని నాగార్జున వెంటనే కోర్టును ఆశ్రయించారు. నాగార్జున తరపున న్యాయవాదులు కోర్టులో వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావాను దాఖలు చేశారు. ఇదే కాకుండా,కేటీఆర్ కూడా కొండా సురేఖ తనపై చేసిన విమర్శలకు సంబంధించి విడిగా పరువు నష్టం పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసుల విచారణ కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో, నాగార్జునతో సహా ఆయన కుటుంబ సభ్యులు కూడా విచారణలకు హాజరై తమ వాంగ్మూలాలను (సాక్ష్యాలను) కోర్టుకు సమర్పించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.