12A రైల్వే కాలనీ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో థ్రిల్ చేసే సినిమా – అల్లరి నరేశ్

Allari Naresh Says 12A Railway Colony Offers a Different and Thrilling Screenplay

అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేసింది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు.తాజాగా లాంచ్ చేసిన 12A రైల్వే కాలనీ ట్రైలర్‌ సినిమా టోన్‌ , మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. మిస్టరీ మర్డర్స్ సిరీస్‌ చుట్టూ తిరిగే కథలో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఈ ట్రైలర్‌ సస్పెన్స్‌ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. మూఢనమ్మకాలు, హీరోకి ఎదురైన భయానక అనుభవాలతో పాటు వాస్తవం – మానసిక భ్రమలు మరింత థ్రిల్ ని క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. నా సామి రంగ సక్సెస్ తర్వాత నిర్మాత శ్రీనివాస్ గారు నాతో మరో సినిమా చేయాలని అన్నారు. నచ్చిన కథ ఉంటే చూడమని చెప్పారు. తర్వాత మేము చాలా రకాల కథలు విన్నాము. తర్వాత అనిల్ దగ్గర మంచి కథ ఉందని చెప్పారు. నేను ఇప్పుడు వరకు చాలా జానర్స్ చేశాను కానీ ఇలాంటి థ్రిల్లర్స్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ఇలాంటి జానర్ ట్రై చేస్తే బాగుంటుందనిపించింది. చాలా మల్టీ లేయర్స్ ఉండే కథ. ఏ కథ ఎటు నుంచి ఓపెన్ అవుతుంది ఎండ్ అవుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా రేసి ఎక్సైటింగ్ సినిమా ఇది. అని అనిల్ గారు రైటింగ్ స్కిల్స్ నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ నాని సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. తను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. కంగ్రాజులేషన్స్. ఈ సినిమా సక్సెస్ తో తనకి మంచి గిఫ్ట్ ఇస్తాం. చాలా టాలెంటెడ్ టీం తో పనిచేసిన సినిమా ఇది. కామాక్షి చాలా నేచురల్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. డిఓపి రమేష్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఆయనతో మరోసారి పనిచేయాలని ఉంది.

బీమ్స్ గారు వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోను లే అనే పాట చెప్పినప్పుడే నేను తనని నమ్మాను. ఆ పాట బయటకు వచ్చి చాలా పెద్ద హిట్ అయింది. అలాగే కెవ్వు కేకలో బాబు రాంబాబు పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది. నాకు కెరీర్ బెస్ట్ సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్. ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా మెలోడీస్ చేశారు. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బీమ్స్ గారి గురించి నాలుగు లైన్స్ ఎక్కువ రాస్తారు. ఆయన మరిన్ని భారీ ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎవరు విలన్ అవుతారనేది గెస్ చేయలేరు. ఆడియన్స్ అందర్నీ చాలా థ్రిల్ చేస్తుంది .ఈ సినిమా 21వ తారీకున మీ ముందుకు వస్తుంది.ఈ సినిమా చూసి రెండు మూడు చోట్ల మీరు జర్క్ అవుతారు. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని బ్లెస్స్ చేయాలని కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.