తిరువీర్ నెక్స్ట్ మూవీ లాంఛ్ 

Thiruveer’s New Project Officially Launched

లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ తన నెక్స్ట్  ప్రాజెక్ట్ ను ప్రకటించారు. సంక్రాంతికి వస్తున్నాం విజయం తర్వాత ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో భరత్ దర్శన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి ప్రొడక్షన్ నంబర్ 2 గా నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమ ఫస్ట్ ప్రొడక్షన్ శివమ్ భజేతో ప్రేక్షకులని అలరించిన గంగాఎంటర్‌టైన్‌మెంట్స్, మరో ఎక్సయిటింగ్ కథతో వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం  హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు.

ప్రేక్షకులకు వైవిధ్యమైన కథలతో అలరించే తిరువీర్, మసూద నుంచి ప్రీ వెడ్డింగ్ షో వరకు డిఫరెంట్ జానర్లలో ఆకట్టుకున్నారు. ఈ కొత్త సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది.

ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం  ఈ సినిమాకి పని చేస్తోంది. రజాకార్, పొలిమేర చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సి.హెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు. బలగం ఫేం తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌, క చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్‌. స్వయంభు చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని పాటలు రాస్తున్నారు.ఈ నెల 19వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.