తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. జాసన్ సంజయ్ డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా సినిమా రానుంది.ఇక ఈసినిమాకు టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలకానున్న ఈసినిమాకు సిగ్మా అనే టైటిల్ పెట్టారు. ఈ సందర్భంగా సందీప్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ ఇంట్రస్టింగ్ వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా గురించి మేకర్స్ ఆసక్తికర విషయాలను మేకర్స్ వెల్లడించారు.సిగ్మా టైటిల్ వెనుక ఉన్న ప్రత్యేకతను వివరిస్తూ, సిగ్మా అంటే నిర్భయమైన ఒంటరి తోడేలు అని అర్థమని తెలిపారు.సినిమాలో హీరో సందీప్ సొసైటీ నియమాలను ,అడ్డంకులను ధైర్యంగా అధిగమించి, అట్టడుగు స్థాయి నుంచి తన ఉన్నత లక్ష్యాలను ఎలా సాధించాడో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం కేవలం ఒకే జానర్‌కు పరిమితం కాకుండా, ట్రెజర్ హంట్ థ్రిల్‌తో పాటు ఎకానమీ క్రైమ్, యాక్షన్, అడ్వెంచర్, కామెడీ వంటి అన్ని అంశాలను కలగలిపి ఓ పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్‌తో పాటు ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, కిరణ్ కొండా,సంపత్ రాజ్, సుదర్శనన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, కేవలం 65 రోజుల్లోనే ఏకంగా 95 శాతం షూటింగ్ పూర్తైనట్లు మూవీ టీమ్ వెల్లడించింది. కేవలం ఒక పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని దర్శకుడు జాసన్ సంజయ్ తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ త్వరగా పూర్తి చేసుకుని, ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి ప్రారంభంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.తమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.
ఇక స్టార్ హీరోల కొడుకులు సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తుంటే జాసన్ సంజయ్ మాత్రం డైరెక్షన్ వైపు వెళ్ళాడు.మరి తన డైరెక్షన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ సిగ్మా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























