సుధీర్ బాబు కథానాయకుడిగా, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం జటాధర. ఇక నిన్న విడుదలైన ఈసినిమా మిక్స్డ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.అయితే కలెక్షన్ల పరంగా మాత్రం డీసెంట్ అనిపించుకుంది.మొదటి రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.47 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లంకె బిందెలు, వాటికి రక్షణగా ఉండే ధన పిశాచి బంధనం అనే అరుదైన కాన్సెప్ట్‌తో దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ఈ కథను తెరకెక్కించారు. ఈ సినిమా యొక్క కథాంశం ఆసక్తికరంగా ఉన్నా, తెరకెక్కించిన విధానంపై విమర్శకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.జీ స్టూడియోస్ ఈసినిమాను నిర్మించగా తెలుగు తోపాటు హిందీలో కూడా విడుదలైంది.
కథ : దెయ్యాలు, ఆత్మలు లేవని, వాటిని సైన్స్‌తోనే నమ్మాలని వాదించే ఘోస్ట్ హంటర్ శివ (సుధీర్ బాబు) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రుద్రారం అనే గ్రామంలోని ధన పిశాచి (సోనాక్షి సిన్హా) వల్ల తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న శివ, ఆ పిశాచితో ఎలా పోరాడాడు, తన తల్లిదండ్రుల ఆత్మలకు మోక్షం ఎలా కలిగించాడు అనేది మిగతా కథ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























