కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.కెజియఫ్ చిత్రంలో ఖాసిం చాచా పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు హరీష్ రాయ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన థైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు, ఆరోగ్యం విషమించడంతో గురువారం బెంగళూరులోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 55.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హరీష్ రాయ్ తన నట జీవితాన్ని 1990లలో ప్రారంభించారు. 1995లో ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ హిట్ ‘ఓం’ సినిమాలో డాన్ రాయ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. విలన్ పాత్రలతో పాటు బలమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కన్నడ, తమిళ,తెలుగు సినిమాల్లో నటించారు. అయితే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన కెజియఫ్ సిరీస్‌లోని ఖాసిం చాచా పాత్ర ఆయనకు పాన్-ఇండియా స్థాయిలో విశేష గుర్తింపును తీసుకువచ్చింది. రాకీ భాయ్‌కు అండగా నిలిచే విశ్వాసపాత్రుడిగా ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
హరీష్ రాయ్‌కు దాదాపు మూడు సంవత్సరాల క్రితం క్యాన్సర్ నిర్ధారణ అయింది. అయితే అవకాశాలు కోల్పోతానేమో అన్న భయంతో ఆయన ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. కెజియఫ్ షూటింగ్ సమయంలో క్యాన్సర్ కారణంగా ఆయన గొంతు భాగం వాచిపోవడంతో, అది కనిపించకుండా ఉండేందుకు గుబురు గడ్డం పెంచుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపారు.క్యాన్సర్ నాల్గవ దశకు చేరుకున్న తర్వాత, చికిత్సకు ఆర్థిక సహాయం కోసం ఆయన సినీ ప్రముఖులను కోరారు, దీనికి పలువురు నటులు, ముఖ్యంగా ధ్రువ సర్జా సహాయం అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























