సీనియర్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’. బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్ గా 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ‘అఖండ 2: తాండవం’ ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనెల 8న ఈ పాటను వదలనుండుగా రేపు సాంగ్ ప్రోమోను రిలీజ్ కానుంది. ప్రముఖ బాలీవుడ్ గాయకులు శంకర్ మహదేవన్ ,కైలాష్ ఖేర్ ఈసాంగ్ ను పాడగా తమన్ పవర్ ఫుల్ మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటించగా ఆది పినిశెట్టి ,హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇక నాలుగేళ్ళ క్రితం వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ కావడంతో సీక్వెల్ గా గా వస్తున్న అఖండ 2 పై భారీ అంచానాలు వున్నాయి. పాన్ ఇండియా భాషల్లో ఈసినిమా విడుదలకానుంది. మరి అఖండ నుండి వరస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ అఖండ 2 తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























