కాంత ట్రైలర్ రిలీజ్ రిలీజ్

Kaantha Team Unveils the Much Awaited Trailer

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘కాంత’. ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.ఇక ప్రమోషన్ లో భాగంగా ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండి సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.1950ల నాటి సినిమా నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ థిల్లర్ గా రానుంది ఈసినిమా.ట్రైలర్ చూస్తుంటే దుల్కర్ తోపాటు భాగ్యశ్రీ , రానా , సముద్రఖని పోటీ పడి నటించనట్లున్నారు.సినిమాలో వీరి నటన హైలైట్ అవ్వడం ఖాయం. ఓవరాల్ గా ట్రైలర్… సినిమా షూర్ షాట్ హిట్ అనే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కాంత పాన్ ఇండియా భాషల్లో విడుదలకానున్నడం తో తెలుగులోనూ ఈసినిమా ఆఫ్ లైన్ ప్రమోషన్స్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా సెన్సార్‌తో సహా ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.కాంత కు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేయగా 2 గంటల 43 నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది.’ది హంట్ ఫర్ వీరప్పన్’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా రానా దగ్గుబాటి మరియు దుల్కర్ సల్మాన్ తమ బ్యానర్ల ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక గత ఏడాది లక్కీ భాస్కర్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన దుల్కర్ రీసెంట్ గా కొత్త లోక తో నిర్మాత గా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. మరి కాంత తో తన సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తాడో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.