ఆంధ్ర కింగ్ తాలూకా రెండు రోజుల ముందుగానే 

Early Premieres for Andhra King Taluka in the USA

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. షూట్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇప్పటివరకు  విడుదలైన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచాయి.రామ్ కూడా ఈసినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఈనెల 28న ఈసినిమా విడుదలకానుంది.అయితే మాములుగా 27న యూఎస్ లో ప్రీమియర్స్ పడాలి కానీ  అంత కన్నా ఒక రోజు ముందే  26నే అక్కడ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 అంటే ఇండియాలో  రిలీజ్ అయ్యే  రెండు రోజుల ముందే ఓవర్సీస్ లో షోస్ పడనున్నాయి.దాంతో  మేకర్స్ కూడా విడుదల తేదీని ఓ రోజు ముందు జరుపాలని చూస్తున్నారు.సినిమాను  27న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. యూఎస్ లో ఈసినిమాను ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తుంది.ఇక సినిమా బాగుంటే రెండు రోజుల ముందు ప్రీమియర్స్ అనే ఆలోచన చాలా హెల్ప్ అవ్వనుంది. లేదంటే నష్టం తప్పదు. 

యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు పి డైరెక్షన్ లో  హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా  నటిస్తుండగా కన్నడ స్టార్ ఉపేంద్ర  స్టార్ హీరో పాత్రలో కనిపించనున్నాడు.అతని అభిమానిగా  సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నాడు.తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.