ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు చివర్లో థియేటర్లలోకి వచ్చిన మలయాళ సినిమా లోక: చాప్టర్ 1 -చంద్ర ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.2 కోట్ల ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన ఈసినిమా ఫుల్ రన్ లో 300కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ రోజు నుంచి జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు ,తమిళం,కన్నడ , హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ ఈ చిత్రం ఓటీటీ లోకి అందుబాటులోకి వచ్చింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి విడుదలైన 40 రోజుల్లోనే రూ. 300 కోట్లు వసూలు చేసి, మలయాళంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా (మోహన్‌లాల్ నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ రికార్డును బద్దలు కొట్టి) సరికొత్త రికార్డును నెలకొల్పింది.తెలుగులో ఈసినిమా కొత్త లోక గా విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది.
కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన ఈసినిమాలో నస్లేన్, శాండి మాస్టర్ కీలక పత్రాలు పోషించిన ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించాడు. ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ ఈసినిమాను నిర్మించాడు.ఇక ఈ యూనివర్స్ లో చాప్టర్ 2 కూడా రానుంది. ఇందులో టోవినో థామస్ లీడ్ రోల్ లో నటించనున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























