కోలీవుడ్ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ ఓ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ కూలీ తరువాత దర్శకత్వానికి తాత్కాలికంగా విరామం ఇచ్చి హీరోగా చేస్తున్నాడు. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ తాజాగా వెలువడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి వామికా గబ్బిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ మరియు లోకేష్‌కు చెందిన జీ స్క్వాడ్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ చేసిన ప్రతీ సినిమా (ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ) బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నేపథ్యంలో, ఆయన హీరోగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.ఈసినిమా ను పూర్తి చేసి లోకేష్ డైరెక్టర్ గా కార్తీ తో ఖైదీ 2 తెరకెక్కించనున్నాడు.
ఇక హీరోయిన్ వామికా గబ్బి విషయానికి వస్తే, 2007లో ‘జబ్ వి మెట్’ సినిమాలో బాలనటిగా కనిపించి, ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో హీరోయిన్ గా చేసి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు పదేళ్ల క్రితం తెలుగులో భలే మంచి రోజు చిత్రంలో కూడా నటించింది. ప్రస్తుతం వామిక , అడవి శేష్ సరసన G2 (గూఢచారి 2)తో పాటు, తమిళంలో జీని చిత్రంలో నటిస్తూ సౌత్ సినిమాలపై దృష్టి సారించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























