ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న మరో సూపర్ హీరో చిత్రం ‘మహాకాళి’ గురించి కీలక అప్‌డేట్ విడుదలైంది. ‘హనుమాన్’ చిత్రంతో విజయవంతంగా తన సూపర్ హీరో యూనివర్స్‌కు శ్రీకారం చుట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఈ కొత్త ప్రాజెక్ట్‌కు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘మహాకాళి’ చిత్రానికి దర్శకురాలు పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రంలో కథానాయికగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన నటి భూమి శెట్టిని ఎంపిక చేశారు. ఇప్పటికే ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె రీసెంట్ గా విజయ్ దేవరకొండ స్పై యాక్షన్ డ్రామా కింగ్డమ్ లో సత్యదేవ్ భార్యగా కనిపించింది. ఇక ఇప్పుడు లీడ్ రోల్ లో మహాకాళి లో నటిస్తుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో “సృష్టి గర్భం నుండి మేల్కొంటున్నాడు విశ్వంలోని అత్యంత క్రూరమైన సూపర్ హీరో – మహాకాళి” అనే ట్యాగ్‌లైన్‌ను ఇచ్చారు.
కొత్త నటికి ఇంత పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో అవకాశం ఇవ్వడం ద్వారా ప్రశాంత్ వర్మ మరోసారి తన టాలెంట్ హంటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆర్ కె డి స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈసినిమా సగం షూటింగ్ కూడా పూర్తీ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























