మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కిరణ్ అబ్బవరం నటించిన కె – ర్యాంప్ ఈ దీపావళికి విడుదలై సూపర్ థియేట్రికల్ రన్ తో విజయాన్ని అందుకుంది. నిన్నటి వరకు ఈసినిమా 30కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టుకుంది. దీపావళికి చివరి సినిమాగా వచ్చి రివ్యూస్ అంత అనుకూలంగా లేకపోయినా మౌత్ టాక్ తో సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈసినిమా సక్సెస్ పై కిరణ్ అబ్బవరం స్పందించాడు.
కె – ర్యాంప్ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులు, మీడియా మరియు సినీ పరిశ్రమ నుండి నా శ్రేయోభిలాషులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన మా నిర్మాతలకు, దర్శకుడికి మరియు మొత్తం నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందానికి అభినందనలు.
నాపై మీరు చూపిన నిస్సందేహమైన ప్రేమకు నా శ్రేయోభిలాషులు/అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు అందరూ నా పక్షాన ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. మా రాబోయే చిత్రాలన్నింటితో మిమ్మల్ని మరింత గర్వించేలా చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.ప్రేమతో,కిరణ్ అబ్బవరం అని ఎక్స్ లో పోస్ట్ షేర్ చేశాడు.
ఇక కిరణ్ ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీ గౌరీ ప్రియా ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా సాయి రాజేష్ , ఎస్ కె ఎన్ నిర్మిస్తున్నారు. ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























