మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’. ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో, సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈవెంట్ లో హీరో రవితేజ మాట్లాడుతూ.. అభిమానులు అరవడంతో ఏం మాట్లాడాలో మర్చిపోతున్నానని సరదాగా అన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, భీమ్స్ తన ఎమోషన్‌తో స్క్రీన్‌పై అదరగొట్టబోతున్నాడని చెప్పారు.నవీన్ చంద్ర పోషించిన శివుడు పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుందని, ఈ సినిమాతో అతను నెక్స్ట్ లెవల్‌కు వెళ్తాడని తెలిపారు. రాజేంద్రప్రసాద్ గారితో తన కాంబినేషన్ ఈ సినిమాలో అదిరిపోతుందని, శ్రీలీల పాత్ర కూడా కొత్తగా, మాస్‌గా ఉంటుందని చెప్పుకొచ్చారు. గతంలో కొన్ని సినిమాలు నిరాశపరిచినా, ఈ సినిమాతో అలాంటి చిరాకు ఉండదని అభిమానులకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. తాను రవితేజకు పెద్ద అభిమానినని, ఇది తన ‘ఫ్యాన్ బాయ్’ మూమెంట్ అని సంతోషం వ్యక్తం చేశారు. రవితేజ పేరు ఇంట్లో ప్రస్తావనకు వస్తే, అది నవ్వులకే కాదు, ఒక పెద్ద సెలబ్రేషన్‌లా ఉంటుందని తెలిపారు. రవితేజ ఒక పెద్ద ఎక్స్‌ప్లోజివ్ అని, సబ్‌టైటిల్స్ లేకుండా తమిళంలో కూడా ఆయన సినిమాలను ఎంజాయ్ చేయవచ్చని చెప్పారు.భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ గారి తర్వాత ఆ అద్భుతమైన ‘కామిక్ టైమింగ్’ రవితేజలోనే ఉందని సూర్య ప్రశంసించారు.అలాగే, తన తమ్ముడు కార్తీ కెరీర్‌లో ‘విక్రమార్కుడు’ రీమేక్ అయిన ‘సిరుత్తై’ చాలా ముఖ్యమైన స్థానాన్ని సంపాదించిందని గుర్తు చేసుకున్నారు.
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. ధమాకా తర్వాత మంచి సినిమాతో వస్తున్నావని అందరూ చెప్పారని, కష్టాలు ఎదురైనా పాజిటివ్‌గా ఎలా ఉండాలో రవితేజ నుంచి నేర్చుకున్నానని తెలిపారు.తనకు కష్టంగా అనిపించిన ఏకవచనంతో వున్న డైలాగ్స్ విషయంలో రవితేజ చాలా సాయం చేశారని కృతజ్ఞతలు చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర ‘ఊర నాటు’గా ఉంటుందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని శ్రీలీల పేర్కొంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























