సూర్య 46లో రవీనా టాండన్ 

Bollywood Actress Raveena Tandon to Star in Suriya 46

సార్ , లక్కీ భాస్కర్ లతో వరస హిట్లు కొట్టి సూపర్ ఫామ్ లో వున్న తెలుగు డైరెక్టర్  వెంకీ అట్లూరి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్యకి ఇది 46వ సినిమా.షూటింగ్  కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.ఇప్పటివరకు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేశారు.పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా  తెరకెక్కుతుంది ఈసినిమా.ఇక ఇందులో  బాలీవుడ్ నటి  రవీనా టాండన్ కీలక పాత్రలో కనిపించనుంది.నిన్న రవీనా బర్త్ డే సందర్భంగా  పోస్టర్ రిలీజ్ చేసి తనకు బర్త్ డే విషెష్ చెప్పింది సూర్య 46 టీం. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో  ప్రేమలు ఫేమ్ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.చాలా గ్యాప్ తరువాత సూర్య తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.వచ్చే ఏడాది ఫిబ్రవరి లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 

ఇక సూర్య ఈసినిమా కన్నా ముందు కరుప్పు తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.షూటింగ్ కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటించింది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.తెలుగులోకూడా ఈసినిమా కరుప్పు అనే టైటిల్ తో విడుదలకానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.