కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

Kantara Chapter 1 OTT Release Date Locked

దసరా రోజున విడుదలై 800కోట్లకు పైగా వసూళ్ళతో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది  రిషబ్ శెట్టి  కాంతార: చాప్టర్ 1.నాలుగో వారం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా ఇప్పటికీ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఫుల్ రన్ లో 1000కోట్ల క్లబ్ లో చేరుతుందనుకుంటే ఇప్పుడు  ఆ ఛాన్స్  లేదు. ఎందుకంటే ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ అన్ని భాషలకు గాను డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా ఈ నెల 31న స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నట్లు  ఈరోజు అధికారికంగా ప్రకటించింది.కేవలం దక్షిణాది భాషల్లోనే ఈసినిమా అందుబాటులోకి రానుంది. వచ్చే నెల చివర్లో హిందీలో కూడా స్ట్రీమింగ్ లోకి రానుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా ఈసినిమా  కన్నడ లో అదరగొడుతుంది.నిన్నటితో అక్కడ 240కోట్ల వసూళ్ల గ్రాస్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అంతేకాదు కన్నడ లో 200కోట్ల క్లబ్ లో చేరిన  మొదటి సినిమా కూడా ఇదే. ఇక  హిందీలో నిన్నటి తో  200 కోట్ల మార్క్ ను క్రాస్ చేసి  సూపర్ హిట్ అనిపించుకోగా  తెలుగులో 100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. తమిళంలో ఈసినిమా బాహుబలి 2 ,కెజియఫ్ 2 తరువాత  అత్యధిక వసూళ్లను రాబట్టిన డబ్బింగ్  సినిమాగా రికార్డు సృష్టించింది.అలాగే  మలయాళం లో 55 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇలా విడుదలైన అన్ని భాషల్లో కాంతార బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.అయితే ఓవర్సీస్ లో మాత్రం అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. 

ఇక  ఈసినిమా ఇంగ్లీష్ లో కూడా విడుదలకానుంది. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న తొలి భారతీయ చిత్రం కూడా ఇదే. అక్టోబర్ 31న ఇంగ్లీష్ వెర్షన్ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు. హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.