యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ దీపావళికి ఒక్క రోజు ముందు వచ్చి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.రివ్యూస్ అంత అనుకూలంగా రాకున్నా మౌత్ టాక్ బాగుండడం తో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి తో ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి క్లీన్ హిట్ గా నిలిచింది.నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 28 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈరోజు , రేపు కూడా సూపర్ వసూళ్లను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను డైరెక్ట్ చేయగా యుక్తి థరేజా హీరోయిన్ గా నటించింది.కామ్నా జఠ్మలానీ , నరేశ్ కీలక పాత్రల్లో కనిపించారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందించగా హాస్య మూవీస్ బ్యానర్ పై రాకేష్ దండా ఈసినిమాను నిర్మించారు.ఇక కిరణ్ కు మరోసారి దీపావళి సెంటిమెంట్ కలిసొచ్చింది.వరుస పరాజయాల తరువాత గత ఏడాది క తో వచ్చి హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఆతరువాత దిల్ రుబా తో పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఇప్పుడు కె – ర్యాంప్ తరువాత మరోసారి ఫామ్ లోకి వచ్చాడు.
కిరణ్ అబ్బవరం ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మారుతీ శిష్యుడు రవి నంబూరి తెరకెక్కిస్తున్న ఈసినిమాను సాయి రాజేష్ , ఎస్ కె ఎన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























