రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా టైటిల్ చెప్పనున్నారు.1940 బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు పౌజీ అనే టైటిల్ ప్రచారం లో వుంది.మరి ఇదే టైటిల్ ను కొనసాగిస్తారో లేదో అక్టోబర్ 23న క్లారిటీ రానుంది. ఆరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ రివీల్ చేయనున్నారు.అలాగే రిలీజ్ డేట్ కూడా చెప్పే ఛాన్స్ కూడా వుంది.వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. తనకు ఇదే మొదటి సినిమా. మిథున్ చక్రవర్తి,జయప్రద కీలక పాత్రలలో కనిపించనుండగా విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మిస్తున్నాయి.
ఇక ఈసినిమాను పూర్తి చేసిన తరువాత ప్రభాస్, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేయనున్నాడు.వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.దీని తరువాత ప్రభాస్ మచ్ ప్రశాంత్ నీల్ తో సలార్ 2 ,నాగ్ అశ్విన్ తో కల్కి 2 సినిమాలు చేయాల్సి ఉంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























