రివ్యూ : డ్యూడ్

dude review in telugu

నటీనటులు : ప్రదీప్ రంగనాథన్ ,మమితా బైజు ,శరత్ కుమార్,హృదూ హరూన్
ఎడిటింగ్ : భరత్ విక్రమన్
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి
సంగీతం : సాయి అభ్యంకర్
దర్శకత్వం : కీర్తిశ్వరన్
నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్. ఈరెండు 100కోట్ల క్లబ్ లో చేరి బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్నాయి. ఇక ప్రదీప్ నటించిన మూడో డ్యూడ్. ఇందులో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం. కొత్త దర్శకుడు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించాడు. సాయి అభ్యంకర్ సంగీతం సమకూర్చారు. ఈ రోజే ఈసినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈసినిమా ఎలా వుంది ? డ్యూడ్ తో ప్రదీప్ హ్యాట్రిక్ కొట్టాడో లేదో రివ్యూ లో తెలుసుకుందాం.

కథ :

కుందన (మమితా బైజు) — పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె. చిన్నప్పటి నుంచి తన మేనత్త కుమారుడు గగన్ (ప్రదీప్ రంగనాథన్) పట్ల ప్రేమాభిమానాలు పెంచుకుంటుంది. చివరకు ప్రపోజ్ చేస్తుంది కానీ గగన్ తిరస్కరిస్తాడు. హార్ట్‌బ్రేక్‌తో బెంగళూరుకు వెళ్ళిపోతుంది కుందన. కానీ ఆ అమ్మాయి దూరమైన తర్వాతే గగన్ మనసులో ప్రేమ మెల్లగా పుడుతుంది.ఆ తరువాత మామయ్య వద్దకు వెళ్లి పెళ్లి కోసం ఒప్పించుకుంటాడు.అయితే పెళ్లి సమయంలో ఏ సమస్య వచ్చింది? కుందన ఎందుకు వెనక్కు తగ్గింది? గగన్ తల్లి (రోహిణి) మరియు కుందన తండ్రి మధ్య ఏం తగాదా ఉంది? పెళ్లి తర్వాత ఏం జరిగింది? గగన్ ఏ త్యాగం చేశాడు? ఇవే మిగతా కథ.

విశ్లేషణ :

డ్యూడ్ లో కథలో కొత్తదనం లేదు కానీ దాన్ని తెర మీద తీసుకొచ్చిన విధానం ఈ సినిమాకి బలం. ప్రేమకథలలో కొత్తదనం చూపించడం కష్టమే కానీ చెప్పే తీరు ఆకట్టుకుంటే సరిపోతుంది. ఆ విషయంలో దర్శకుడు కీర్తిశ్వరన్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదరడంతో సినిమా బాగుందన్న ఫీల్ తో ముగుస్తుంది. ప్రదీప్ రంగనాథన్ మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకూ సహజంగా నటించారు. ఆయనలోని మేనరిజమ్స్, హావభావాలు యువతరానికి రిలేటబుల్‌గా ఉంటాయి. రెగ్యులర్ సన్నివేశాలైనా ఆయన నటన వల్ల కొత్తగా అనిపిస్తుంది.

సినిమా స్టార్ట్ అవ్వడం స్లో గా వున్నా మెల్లి మెల్లిగా స్పీడ్ అందుకొని ఇంట్రెస్ట్ ను పెంచుతుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వల్ వరకు హిలేరియస్ బ్లాక్ తో ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కొంచెం ప్లాట్ గా అనిపించినా చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది. . క్లైమాక్స్ సంతృప్తికరంగా ఉండడంతో ప్రేక్షకులు సినిమా సూపర్ అనే ఫీల్ తో బయటికి వచ్చేస్తారు.

నటీనటుల విషయానికి వస్తే డ్యూడ్ విజయం లో మెయిన్ క్రెడిట్ అంత ప్రదీప్ కే వెళ్తుంది. సినిమాను తన భుజాలపై వేసుకున్నాడు.తన నటనతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు.తన హావభావాలతో సాధరణ సన్నివేశాలు కూడా సూపర్ అనిపిస్తాయి. మమితా బైజు సహజంగా నటించి కథకు అందం చేకూర్చింది. శరత్ కుమార్ పాత్ర సప్రైజ్ చేస్తుంది. మొదట ఫన్నీగా, తర్వాత సీరియస్‌గా మారడం ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేసింది. హృదూ హరూన్ పాత్ర బాగా రిజిస్టర్ అయ్యింది. రోహిణి, సత్య, నేహా శెట్టి తమ పాత్రల మేరకు బాగా చేశారు.

టెక్నికల్ గా కూడా సినిమా మెప్పించింది. మొదటి సినిమాతో కీర్తిశ్వరన్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. కథలో పెద్ద ట్విస్ట్ లేకపోయినా, ఇంటర్వెల్ బ్లాక్ డీల్ చేసిన విధానం చాలా బాగుంది.ఆయన రాసిన కొన్ని కామెడీ సీక్వెన్స్‌లు ఆకట్టుకుంటాయి. సాయి అభ్యంకర్ సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. తనకు ఇదే మొదటి సినిమా.సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్‌లను చక్కగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ సూపర్ అనేలా వుంది. విజువల్స్ క్వాలిటీ గా వున్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. పర్ఫెక్ట్ రన్ టైం సెట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు:

మంచి అంచనాల తో విడుదలైన డ్యూడ్ ఆ అంచనాలను అందుకొని ఆకట్టుకుంది.ఫస్ట్ హాఫ్ , ప్రదీప్ రంగనాథన్ వన్‌మ్యాన్ షో, సాయి అభ్యంకర్ మ్యూజిక్ , విజువల్స్ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు. యూత్ కి ఈసినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈసినిమాను ఈజీగా ఓ సారి చూసేయచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.