సామ్రాజ్యం ప్రోమో రిలీజ్ చేసిన ఎన్టీఆర్

NTR Launches Vetri Maaran-Silambarasan TR’s Saamrajyam Promo

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్, కోలీవుడ్ స్టార్ హీరో సిలంబరసన్ TR (STR) కాంబినేషన్‌లో ‘అరసన్’ అనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ హై-బడ్జెట్ ప్రాజెక్ట్ గతంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘వడ చెన్నై’ ప్రపంచంలో భాగంగా రూపొందుతుండటం విశేషం. కాగా, దీనికి కూడా వెట్రిమారన్ దర్శకత్వం వహించడం గమనార్హం. కాగా, తెలుగులో ఈ సినిమాను ‘సామ్రాజ్యం’ పేరుతో తీసుకురానున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ‘సామ్రాజ్యం’ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయడం విశేషం. ప్రోమో అయితే మంచి ఇంటెన్స్‌తో సాగుతూ ఆకట్టుకునేలావుంది. చూస్తుంటే ,వాస్తవిక సంఘటనల ఆధారంగా ఇది రూపొందనున్నట్టు తెలుస్తోంది. తాను చెప్పే స్టోరీని సినిమాగా తీస్తే, తన పాత్రలో ఎన్టీఆర్‌ని పెట్టి తీయాలని, పెర్ఫార్మెన్స్ కుమ్మి వదిలిపెడతాడు అంటూ శింబు చెప్పడం ప్రోమోకే హైలైట్‌గా నిలిచింది.

‘అరసన్’ ప్రత్యేకతలు..

  • టైటిల్ అర్థం: ‘అరసన్’ అంటే తెలుగులో ‘రాజు’ అని అర్థం. చిత్రంలో సిలంబరసన్ పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతోందో ఈ టైటిల్ సూచిస్తోంది.
  • వడ చెన్నై ప్రపంచం: ఈ చిత్రం కూడా వెట్రిమారన్ మార్క్ గ్రామీణ నేపథ్యంలో, ఉత్తర చెన్నైలోని ముఠా పోరాటాల కథాంశంతో వాస్తవికతకు దగ్గరగా రూపొందనుంది.
  • రాక్ స్టార్ మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించబోతుండటం మరింత ఆసక్తికరం.
  • బిగ్ కొలాబరేషన్: మాస్ హీరో STR, క్లాసిక్ సినిమాలు రూపొందించే వెట్రిమారన్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ V క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత కలైపులి ఎస్ థాను భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ‘అరసన్’ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫస్ట్ లుక్ లేదా టీజర్‌ను త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో మరో సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.