ఓటీటీ లోకి వచ్చేసిన కిష్కింధపురి

Kishkindhapuri Streaming Now on OTT

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అందాల తార అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన తర్వాత, ఇప్పుడు ఓటీటీ లోకి అడుగుపెట్టింది. కొంతకాలంగా ఈ సినిమా డిజిటల్ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్త.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘స్ట్రీమింగ్ వివరాలు

కిష్కింధపురి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ (ZEE5) సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే నేటినుంచి ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఆదివారం నుండి Z తెలుగు టీవీ ఛానల్ లోనూ ప్రసారం కానుంది. సో, థియేటర్‌లో మిస్ అయిన హారర్ ప్రియులు, ఈ సినిమాను ఇంట్లో కూర్చుని చూసి ఆస్వాదించడానికి ఇదే సరైన సమయం.

కథాంశం ఏమిటంటే..?

కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, రాఘవ (బెల్లంకొండ శ్రీనివాస్) మరియు మైథిలి (అనుపమ పరమేశ్వరన్) అనే ఇద్దరు ‘ఘోస్ట్ వాకింగ్ టూర్’ నిర్వాహకుల చుట్టూ తిరుగుతుంది. వీరు తమ టూర్‌లో భాగంగా ‘సువర్ణ మాయ’ అనే రేడియో స్టేషన్‌కి వెళ్తారు. అక్కడ అనుకోకుండా ఒక ఆత్మను మేల్కొలపడంతో, ఆ బృందానికి ఎదురైన భయంకర సంఘటనలు, ఊహించని మలుపులతో ఈ సినిమా చివరి వరకు ఉత్కంఠను పంచుతుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.