‘నవ దళపతి’ సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నెగటివ్ రోల్ ప్లే చేస్తుండగా.. మరో ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ పాన్-ఇండియా లెవెల్లో నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఇది విడుదల కావడం విశేషం. ఇక ఈ ట్రైలర్ గమనిస్తే, సుధీర్ బాబు మరోసారి తన వైవిధ్యమైన నటనను నిరూపించుకున్నారు. ప్రతి సినిమాతో కొత్త అవతారాన్ని ప్రదర్శించే ఈ యాక్షన్ హీరో, ఈసారి పూర్తి భిన్నమైన రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ట్రైలర్ ప్రారంభం నుంచే సస్పెన్స్, మిస్టిక్ ఎలిమెంట్స్‌తో నిండిపోయి కనిపించింది. సుధీర్ బాబు డిఫరెంట్ లుక్‌లో కనిపించడం అభిమానులను షాక్‌కి గురి చేస్తూ, అదే సమయంలో ఆసక్తిని రేకెత్తించింది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్, డివైన్ ఎలిమెంట్స్ కలయికగా రూపొందించారని తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ ట్రీట్మెంట్, సుధీర్ బాబు యాక్షన్ సీన్స్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.
ముఖ్యంగా హీరో చెప్పే డైలాగ్స్‌లోని ఇంటెన్సిటీ, లోతైన అర్థం సినిమాపై పెద్ద అంచనాలు పెంచుతోంది. ‘జటాధర’లో సుధీర్ బాబు పాత్రలోని రహస్యత, ఆధ్యాత్మిక శక్తుల మధ్య ఉన్న కాంక్లిక్ట్ కథను మరింత ఇన్‌ట్రెస్టింగ్‌గా మార్చనున్నట్లు టీమ్ సూచించింది. ఇంకా సోనాక్షి సిన్హా ప్రతినాయక ఛాయలున్న క్యారక్టర్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. సీనియర్ నటి శిల్పా శిరోద్కర్‌కి కూడా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రే పడినట్టు తెలుస్తోంది.
మొత్తానికి, ‘జటాధర’ ట్రైలర్ సుధీర్ బాబు కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ సినిమా త్వరలో థియేటర్లలో ప్రేక్షకులను ఒక మిస్టిక్ యాక్షన్ జర్నీకి తీసుకెళ్లబోతోందని ట్రైలర్ హామీ ఇస్తోంది. ఇక ఈ చిత్రం ప్రేరణ అరోరా సమర్పణలో జీ స్టూడియోస్ మరియు సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పతాకాలపై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























