లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రేపే ఈ సినిమా థియేటర్లోకి రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఇందులో మమిత బైజు హీరోయిన్ గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. హైదరాబాదు నాకు ఇంకో ఫ్యామిలీ. నా సినిమాలన్నీ గొప్పగా ఆదరించారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ కుటుంబంలో ఒకరిగా చూసినందుకు చాలా థాంక్స్. లవ్ టుడే, డ్రాగన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా డ్యూడ్ కూడా నచ్చుతుంది. అదిరిపోయే సినిమా ఇది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మైత్రి మూవీ మేకర్స్ కి థాంక్యూ. నాకు తెలుగులో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవ్వాలని ఉంటుంది. ఇది నాకు మంచి అవకాశం. మైత్రి మూవీ మేకర్స్ చాలా అద్భుతంగా పే చేస్తారు.
ఈ సినిమా కోసం చాలా మంచి పేమెంట్స్ తీసుకున్నాను.(నవ్వుతూ)డైరెక్టర్ కీర్తికి థాంక్యూ. చాలా మంచి సినిమా తీశాడు. సినిమా చూసిన తర్వాత అతను ఎంత పెద్ద డైరెక్టర్ అవుతారో మీరే చెప్తారు. సాయి చాలా పెద్ద కంపోజర్ అవుతాడు. ఇప్పటికే తను చాలా మంది అభిమానులు సంపాదించుకున్నాడు. మమితకి థాంక్యూ. తను అద్భుతమైన ఎనర్జీతో పెర్ఫాం చేసింది. ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికి థాంక్యూ. నికేత్ బొమ్మకి థాంక్యూ. డ్యూడ్ అక్టోబర్ 17న రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. తెలుగు ఆడియన్స్.. ఐ లవ్ యు ఫరెవర్ అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























