రెబల్ స్టార్ ప్రభాస్ – స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్. 2023 డిసెంబర్‌లో విడుదలైన ఈసినిమా 600 కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈసినిమా తో ప్రభాస్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది.ఇందులో ప్రభాస్ ను నెక్స్ట్ లెవెల్లో చూపించాడు ప్రశాంత్ నీల్. ముఖ్యంగా ఎలివేషన్ సీన్లు ఫ్యాన్స్ ను ఫిదా చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక థియేటర్లలోనే కాదు సలార్ ఓటీటీ ల్లో కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఆ తరువాత మధ్యలో పలు సార్లు థియేటర్లలో రీ రిలీజ్ అయిన ఈసినిమా ఇప్పుడు మరో సారి థియేటర్లోకి రానుంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈనెల 23న సలార్ రీ రిలీజ్ కానుందని నిర్మాతలు ప్రకటించారు. ఈసినిమాతోపాటు ప్రభాస్ ,మొదటి సినిమా ఈశ్వర్ కూడా థియేటర్లలోకి రానుంది.
ఇక సలార్ పార్ట్ 2 కూడా రానుందని తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడం అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండడం తో సలార్ 2 ఆలస్యం కానుంది. అన్ని కుదిరితే 2027లో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ వుంది.సలార్ పార్ట్ 2 కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























