ఇండస్ట్రీ హిట్ గా కాంతార చాప్టర్ 1

Kantara Chapter 1 Shatters Records Becomes Industry Hit

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది. సెకండ్ వీక్ లో ఎక్స్ట్రాడినరీ హోల్డ్ తో సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి తో ఈసినిమా కర్ణాటక లో 200కోట్ల మార్క్ క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.కన్నడ ఇండస్ట్రీ లో ఇదే మొదటి 200కోట్ల సినిమా. ఇంతకుముందు కాంతార 185 కోట్ల తో మొదటి స్థానంలో ఉండగా ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 ఆ రికార్డు బ్రేక్ చేసింది.ఫుల్ రన్ లో 250కోట్ల వరకు రాబట్టుకునే ఛాన్స్ వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఒక్క కన్నడ లోనే మిగితా భాషల్లోనూ ఈసినిమా అదరగొడుతుంది. హిందీలో నిన్నటితో 157కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 200 కోట్ల క్లబ్ లో చేరుతుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసినిమా సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.అయితే దీపావళికి నాలుగు సినిమాలు విడుదలవుతుండడంతో కాంతార చాప్టర్ 1 కు తెలుగులో భారీ పోటీ ఎదురుకానుంది.

ఇక మలయాళంలో బ్లాక్ బస్టర్ రన్ తో 50కోట్ల క్లబ్ లో చేరనుంది. అలాగే తమిళ్ లో 50కోట్ల వసూళ్లను రాబట్టుకుని సూపర్ హిట్ అనిపించుకుంది. ఓవర్సీస్ విషయానికి వస్తే నిన్నటి వరకు 100కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఓవరాల్ గా చూస్తే 12 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 670 కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టుకుంది.రేపటి తో 700 కోట్ల క్లబ్ లో చేరనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.