విజయ్ ఆంటోని ‘భద్రకాళి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

Vijay Antony’s Bhadrakaali OTT Platform and Streaming Date Fixed

ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ విజయ్ ఆంటోని నటించి, సంగీతం అందించిన తాజా పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ‘భద్రకాళి’. విజయ్ కెరీర్‌లో 25వ సినిమాగా రూపొందిన ఈ చిత్రం గతనెల 5వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్ట్రీమింగ్ వివరాలు

ఈ మేరకు సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ ప్రకటించిన ప్రకారం, ‘భద్రకాళి’ చిత్రం అక్టోబర్ 24న ప్రముఖ ఓటీటీ వేదిక **జియో హాట్‌స్టార్ **లో స్ట్రీమింగ్ కానుంది. అయితే తెలుగు, కన్నడ భాషల్లో ఇదే పేరుతో రానున్న ఈ సినిమా, తమిళం మరియు మలయాళం భాషల్లో మాత్రం ‘శక్తి తిరుమగన్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కథా నేపథ్యం..

దర్శకుడు అరుణ్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందింది. ఇందులో విజయ్ ఆంటోని కిట్టు అనే పవర్‌ఫుల్ బ్రోకర్ పాత్రలో నటించారు. ప్రభుత్వ వ్యవహారాల్లో చక్రం తిప్పే ఓ సామాన్య వ్యక్తి రాజకీయ చదరంగంలో ఎలా కీలకమయ్యాడు? వ్యవస్థను ఎలా ప్రభావితం చేశాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపొందింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.