‘లవ్ టుడే, డ్రాగన్’ చిత్రాల ద్వారా తెలుగులో పాపులర్ అయిన ప్రముఖ తమిళ యువ దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు ‘డ్యూడ్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బుకింగ్స్ ప్రారంభం
దీపావళి కానుకగా అక్టోబర్ 17న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్ సహా థియేట్రికల్ ట్రైలర్ మంచి హైప్ సృష్టించాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు. నైజాం (తెలంగాణ) ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభం అయ్యాయి. ఈ టికెట్ల కోసం ప్రేక్షకులు ‘బుక్‌మైషో’, ‘డిస్ట్రిక్ట్’ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP ద్వారా నిజాంలో ఈ సినిమా విడుదల కానుంది.
మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, “డ్యూడ్ స్వాగ్ ఈవెంట్” ఈరోజు హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో సాయంత్రం 6 గంటల నుండి జరగనుంది. ఈ ఈవెంట్‌కి చిత్ర యూనిట్ అంతా పాల్గొననుండగా, అభిమానులు, సినిమా ప్రేమికులు భారీగా హాజరుకానున్నారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా దీపావళి ఫెస్టివల్‌లో ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























