యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఫంకీ. జాతి రత్నాలు తో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న డైరెక్టర్ అనుదీప్ నుండి వస్తున్న సినిమాకావడంతో ఫంకీ పై అంచనాలు వున్నాయి. కొద్దీ రోజుల క్రితం టీజర్ కూడా రిలీజ్ చేశారు.అనుదీప్ మార్క్ కామెడీ తో వచ్చిన ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈసినిమాలో విశ్వక్ సేన్ డైరెక్టర్ గా నటిస్తుండగా హీరోయిన్ కయదు లోహర్ నిర్మాత రోల్ లో కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ఇక సినిమా విడుదల ముందుకు జరిగింది. ముందు వచ్చే ఏడాది ఫిబ్రవరి లో తీసుకొద్దామనుకున్నారు అయితే అనుకున్న దానికంటే ముందే సినిమా రెడీ అవుతుండడంతో డిసెంబర్ 25న క్రిస్మస్ కి రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు మేకర్స్.త్వరలోనే రిలీజ్ విషయంలో క్లారిటీ రానుంది.ఫన్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్,మెంట్ ,శ్రీకర స్టూడియోస్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.
ఇక వరుస పరాజయాలతో రేస్ లో వెనకబడ్డ విశ్వక్ సేన్, ఫంకీ తో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు.ఇక విశ్వక్ మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టాడని సమాచారం.త్వరలోనే ఈసినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























