జటాధర నుండి ‘ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా’ సాంగ్ రిలీజ్

Trend Set Chey Pilloda Song Out From Jatadhara

టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుడు సుధీర్ బాబు, బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి ‘ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా’ అనే పాటను విడుదల చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యువతను ఊపే మాస్ బీట్

‘ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా’ పాట పూర్తిగా మాస్, ఎనర్జిటిక్ బీట్‌తో కూడిన డ్యాన్స్ నంబర్‌గా రూపొందింది. ఇందులో సుధీర్ బాబు తన స్టైలిష్ లుక్, ఫుట్-ట్యాపింగ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ పాట ప్రత్యేకంగా యువతను, డ్యాన్స్ లవర్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. పాటలోని ఆకర్షణీయమైన సాహిత్యం, క్యాచీ ట్యూన్.. సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

ఈ పాటలో సుధీర్ బాబు వేసిన స్టెప్పులు, ఎనర్జీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతున్నాయి. రేపు ఇది థియేటర్లలో ప్రేక్షకులను ఊపేయడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో మరియు మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌గా మారింది.

ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ పాన్-ఇండియా చిత్రం నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.