కాంతార చాప్టర్ 1 హిందీలో 150 కోట్లు

kantara-chapter-1-hindi-version-joins-150-crore-club

దసరా రోజున భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తోంది. నిన్నటి తో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 670కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. దాంతో కన్నడ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో సినిమాగా కాంతార చాఫ్టర్ 1 రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈఏడాది సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా కర్ణాటకలో ఈసినిమా సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి తో అక్కడ 190కోట్ల మార్క్ ను చేరుకుంది.ఫుల్ రన్ లో 250కోట్ల క్లబ్ లో చేరనుంది.ఇక హిందీలో నిన్నటి తో 150కోట్ల మార్క్ చేరుకుంది. ఫుల్ రన్ లో 200 కోట్ల క్లబ్ లో చేరుతుందో చూడాలి.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసినిమా సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.అయితే దీపావళికి నాలుగు సినిమాలు విడుదలవుతుండడంతో కాంతార చాప్టర్ 1 కు తెలుగులో భారీ పోటీ ఎదురుకానుంది.

ఇక మలయాళంలో 50కోట్ల వసూళ్లకు చేరువలో వుంది.ఇప్పటికే అక్కడ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అలాగే తమిళ్ లో 50కోట్ల వసూళ్లను రాబట్టుకుని సూపర్ హిట్ అనిపించుకుంది. ఓవర్సీస్ విషయానికి వస్తే ఒక్క నార్త్ అమెరికా లో 4.3 మిలియన్ డాలర్ మార్క్ ను చేసింది. ఓవరాల్ గా చూస్తే 10మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది.

బ్లాక్ బస్టర్ కాంతార కు ప్రీక్వెల్ గా రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.