అన్ని ఫార్మాట్లలో రిలీజవుతోన్న బాహుబలి ది ఎపిక్

Baahubali The Epic Releasing in All Premium Large Formats Ccross The Globe

భారత సినీ చరిత్రను మార్చిన మాస్టర్‌పీస్ ‘బాహుబలి: ది బిగినింగ్‘ మరియు దాని సీక్వెల్ ‘బాహుబలి: ది కంక్లూజన్‘ చిత్రాలు మళ్లీ భారీ తెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. అయితే, ఈసారి “బాహుబలి”ని కేవలం సినిమా కాదు, ఒక భారీ విజువల్ ఫెస్టివల్‌గా అనుభవించనున్నారు ప్రేక్షకులు. IMAX, Dolby Cinema, 4DX, D-BOX, EPIQ, ICE Theatres, PCX వంటి అత్యాధునిక సినీ ఫార్మాట్లలో రీ-రిలీజ్ అవుతున్న ఈ చిత్రం, ప్రతి సీన్‌ను మరింత రియలిస్టిక్‌గా, హృదయానికి తాకేలా మలచనుంది.

బాహుబలిలోని యుద్ధ సన్నివేశాలు, కట్టిపడేసే నేపథ్య సంగీతం, ఆ కధలోని మహత్తరమైన భావోద్వేగం — ఈ కొత్త టెక్నాలజీలతో మరింత శక్తివంతంగా దర్శనమివ్వనుందని అభిమానులు భావిస్తున్నారు. మావెరిక్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం, బాహుబలిగా ప్రభాస్, క్రూరమైన రాజుగా రానా దుగ్గుబాటి, అందాల తారలు అనుష్క, తమన్నా అద్భుత నటనతో ఈ చిత్రం మళ్లీ థియేటర్లలో కొత్త అనుభూతిని అందించనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.