సూపర్ సుబ్బుతో ఆ మౌనాన్ని బ్రేక్ చేయాలనిపించింది – డైరెక్టర్ మల్లిక్ రామ్

Director Mallik Ram Reveals Interesting Facts About Super Subbu

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో రూపొందుతోన్న కొత్త ప్రాజెక్ట్ ‘సూపర్ సుబ్బు’. అయితే ఇది సినిమాగా కాకుండా ఓ వెబ్ సిరీస్‌లా తెరకెక్కుతుండటం విశేషం. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత రాజీవ్ చిలకా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ తాజాగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. “సూపర్ సుబ్బు ఆలోచన ఒక అబ్జర్వేషన్ నుంచి పుట్టింది. ఈ రోజుకీ ‘సెక్స్ ఎడ్యుకేషన్’ గురించి మనం ఇంకా గుసగుసలలోనే మాట్లాడుతున్నాం. తల్లిదండ్రులు దాన్ని దాటవేస్తారు, పాఠశాలలు విస్మరిస్తాయి, పిల్లలు అపోహలతో పెరుగుతారు. ఆ మౌనాన్ని ఒక కథగా మార్చాలని అనిపించింది. సుబ్రహ్మణ్యం అనే పాత్ర ద్వారా అవగాహన ఎలా కలుగుతుందో చూపించాలనుకున్నాం. మాఖీపూర్ ప్రజల అపోహలు, ఆప్యాయత.. ఇవన్నీ మనందరికీ తెలిసిన గ్రామజీవనాన్ని గుర్తు చేస్తాయి.” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.