మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుండి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి పాట (ఫస్ట్ సింగిల్) ‘మీసాల పిల్ల’ నేడు (సోమవారం, అక్టోబర్ 13) విడుదలైంది. విడుదలైన కొద్దిసేపటిలోనే ఈ పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌తో యూత్‌లో, మెగా ఫ్యాన్స్‌లో ఈ సాంగ్ తెగ వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వింటేజ్ చిరుని గుర్తుకు తెచ్చిన ‘మీసాల పిల్ల’
చిరంజీవి-నయనతారలపై కలర్‌ఫుల్‌గా చిత్రీకరించిన ఈ మెలోడీకి భీమ్స్ సిసిరోలియో అందించిన ట్యూన్ అద్భుతంగా కుదిరింది. ఈ ట్రాక్ పవర్ ఫుల్ ఎలక్ట్రానిక్ బీట్స్, పంచ్ బాస్ లైన్స్, మెలోడీలతో అదిరిపోయింది. చిరంజీవి తన మెగా గ్రేస్‌తో స్టెప్పుల్లో పాత వైబ్‌ను గుర్తుకు తెచ్చారు. నయనతారను ఉద్దేశించి “మీసాల పిల్ల” అంటూ టీజ్ చేసే సందర్భం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే, ముఖ్యంగా ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ గాత్రం. చాలా కాలం తర్వాత తెలుగులో ఆయన ఆలపించిన ఈ పాట.. శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆయన నోస్టాల్జిక్ వాయిస్ ఈ పాటకి మరింత వైబ్ యాడ్ చేసింది. ఆయనతో పాటు శ్వేతా మోహన్ గానం కూడా పాట స్థాయిని పెంచింది. సీనియర్ లిరిసిస్ట్ భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు.
ఇక విడుదలైన వెంటనే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. పాటలోని కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ మరియు క్యాచీ లిరిక్స్ సోషల్ మీడియాలో, ముఖ్యంగా రీల్స్‌లో, షార్ట్స్‌లో భారీగా వైరల్ అవుతున్నాయి.
‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాటతోనే సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉండబోతుందో ఈ ఫస్ట్ సింగిల్ ద్వారా ఒక హింట్ లభించిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























