పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.పవన్ ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు.ఇక ఈరోజు నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.దాదాపు 25రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ కానుంది.ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హరీష్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరక్కుతున్న ఈసినిమాలో శ్రీలీల ,రాశి ఖన్నా హీరోయిన్లు గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఇక ఇదిలావుంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓజీ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈసినిమా 300కోట్లకుపై గా వసూళ్లను రాబట్టుకుంది.ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రియాంక మెహన్ హీరోయిన్ గా నటించింది.డివివి దానయ్య , దాసరి కళ్యాణ్ నిర్మించారు.
ఇక పవన్ కు ఈఏడాది ఇది సెకండ్ రిలీజ్.జులైలో హరి హర వీరమల్లు పార్ట్ 1 తో రాగ ఆ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.అయితే ఆ తరువాత ఓజీ తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























