డ్యూడ్‌.. ప్రదీప్ ఆల్ రౌండర్ యాక్టర్ – శరత్ కుమార్

Veteran Actor Sarath Kumar Hails Dude Hero Pradeep Ranganathan as an All-Rounder

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్‌’తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, ప్రముఖ సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శరత్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

డ్యూడ్ కథ వినప్పుడు ఎలా అనిపించింది?

  • కథలో ముఖ్య భాగమయ్యే పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. డైరెక్టర్ కీర్తిశ్వరన్ గారు డ్యూడ్ కథ చెప్పారు.
  • కథ అద్భుతంగా వుంది. ప్రదీప్ కి అంకుల్ గా కనిపిస్తాను. నా పాత్ర కథలో చాలా క్రూషియల్. చాలా కొత్త పాయింట్.
  • ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఒక మేటర్ జరిగితే సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుందనే కోణంలో డైరెక్టర్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు.
  • ఇది రెగ్యులర్ సినిమాలా వుండదు. కామెడీ హ్యుమర్ ఎమోషన్ అన్నీ డిఫరెంట్ గా చూపించారు.
  • పెర్ఫార్మెన్స్ చేయడం కూడా టఫ్. మైత్రీ మూవీ మేకర్స్ తో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

ఈ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది?

  • ఈ క్యారెక్టర్ చేయడం చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. చాలా డిఫరెంట్ షేడ్స్ వుంటాయి.
  • అలాంటి క్యారెక్టర్ ని ప్లే చేయడం కూడా చాలా డిఫికల్ట్.
  • నా క్యారెక్టర్ కి వున్న రూల్స్, కండీషన్స్ డిఫరెంట్ గా వుంటాయి. మంచి కాన్ఫ్లిక్ట్ వుంటుంది.

మీరు డిఫరెంట్ జనరేషన్ డైరెక్టర్స్ లో వర్క్ చేశారు కదా.. ఎలా అనిపిస్తుంటుంది?

  • అందరూ టెక్నికల్ గా సౌండ్ వుంటారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైయింది.
  • ఇప్పటి డిజిటల్ టెక్నాలజీకి తగ్గట్టు మేకర్స్ అప్డేట్ అవుతూ ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నారు.
  • చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం.

అప్పటికి ఇప్పటికి మీలో వచ్చిన మార్పు ఏమిటి? నటులకి మీరు ఇచ్చే సలహా ఏమిటి?

  • అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు. మంచి కథలు, పాత్రలు చేయాలనే తపనే ఎప్పుడూ వుంటుంది.
  • షాట్ ఓకే అయిన తర్వాత నటీనటులు మానిటర్ చూస్తుంటారు. మానిటర్ చూడటం డైరెక్టర్ పని.
  • ఆయనకి ఓకే కాకపొతే మరో టేక్ చెబుతారు. అంతేకానీ యాక్టర్స్ ప్రతిసారి వెళ్లి మానిటర్ చూడటం సమయం వృధా అని నా భావన.

డ్యూడ్ ఎలాంటి ఫిల్మ్?

  • ఇది చాలా ఎమోషనల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి కంటెంట్ వుంది.
  • చాలా కొత్త థాట్ వుంది. ఆడియన్స్ చాలా కొత్తగా ఫీల్ అవుతారు.

మ్యూజిక్ గురించి?

  • సాయి అభ్యంకర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.
  • చాలా ట్యాలెంటెడ్ కంపోజర్. ఈ సినిమాకి తన మ్యూజిక్ బిగ్ ఎసెట్.

మైత్రీ మూవీ మేకర్స్ గురించి?

  • మైత్రీ మూవీ మేకర్స్ చాలా పెద్ద ప్రొడ్యూసర్స్. సినిమాని చాలా పాషన్ తో తీస్తారు. సినిమాని ప్రేమిస్తారు.
  • సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడ రాజీపడకుండా సమకూర్చూరు. డైరెక్టర్ కి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు.

ప్రదీప్ రంగనాథన్ గురించి?

  • ప్రదీప్ ఆల్ రౌండర్. మంచి డైరెక్టర్, గుడ్ పెర్ఫార్మర్. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టయిల్ వుంది.
  • ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ హై ఎనర్జీతో వుంటుంది.

ఇంట్లో సినిమాల గురించి మాట్లాడుతుంటారా?

  • వరు డైరెక్టర్ అవుతుంది. ఇంకా ఆ కథ చెప్పలేదు. ఇంట్లో సినిమాల గురించి మాట్లాడుతుంటాం.

మీ డ్రీం రోల్?

  • సుభాస్ చంద్రబోస్ బయోపిక్ చేయాలని వుంది. ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను.

అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి?

  • మిస్టర్ ఎక్స్ అనే సినిమా చేస్తున్నాను. అలాగే నవంబర్ లో ఒక సినిమా రిలీజ్ కి వుంది.
  • బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే గౌతమ్ మీనన్ తో కలసి ఒక సినిమా చేస్తున్నాను.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.