యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురితో సాలిడ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు.గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా 30కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఈసినిమా ఫస్ట్ ఓటీటీ లోకి రానుంది.జీ 5 ఈనెల 17 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. ఆ తరువాత రెండు రోజులకు జీ తెలుగు లో టీవీ ప్రీమియర్ పడనుంది.సో థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీ లో లేదా టీవీ లో చూడొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కిష్కింధపురిలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేశాడు.చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈసినిమాను నిర్మించారు.
ఇక రాక్షసుడు తరువాత చాలా రోజుల నుండి అలాంటి విజయం కోసం ఎదురుచూసిన హీరో సాయి శ్రీనివాస్ కు ఎట్టకేలకు కిష్కింధపురి ఆ సక్సెస్ అందించింది. ఇక ఈసినిమా తరువాత సాయి శ్రీనివాస్ నెక్స్ట్ టైసన్ నాయుడు తో రానున్నాడు.డిసెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఒకవేళ అదే నెలలో వస్తే ఈ ఏడాది సాయి శ్రీనివాస్ కు ఇది థర్డ్ రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























