మాటల కంటే సంగీతమే గట్టిగా మాట్లాడే బ్లాక్‌బస్టర్ కంపోజర్, జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పుడు పూరి జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబినేషన్లో రాబోయే భారీ ప్రాజెక్ట్‌కు సంగీతం అందించనున్నారు. ‘యానిమల్’ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దేశవ్యాప్తంగా తన మ్యూజిక్ పవర్ ఏంటో చూపించిన హర్షవర్ధన్ రామేశ్వర్‌ను తమ టీమ్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిగ్గజాల నటన, పూరి మార్క్ డైరెక్షన్
నటనా రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తమిళ నటుడు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ఆయనకు జోడీగా స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తోంది. అలాగే వీరితోపాటు బాలీవుడ్ స్టార్ నటి టబు, దునియా విజయ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ వంటి దిగ్గజ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా, చార్మి కౌర్ సమర్పణలో, జేబీ నారాయణ్ రావు కొండ్రోళ్ల నిర్మిస్తున్నారు. ఇక యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్ కలగలిసిన ఈ సినిమాకు హర్షవర్ధన్ రాకతో, ఒక న్యూ-ఏజ్ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వివిధ భాషల నటులు, సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. పూరి జగన్నాథ్ మార్క్ టేకింగ్, విజయ్ సేతుపతి అద్భుతమైన నటన, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్… ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























