సుధీర్ బాబు ‘జటాధర’ నుండి స్పెషల్ సాంగ్ వస్తోంది

Pallo Latke Song Coming Soon From Sudheer Babu's Jatadhara

టాలీవుడ్ నవదళపతి సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘జటాధర’. బాలీవుడ్ స్టార్ నటీమణులు సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ముగింపుదశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక సూపర్ అప్‌డేట్ వచ్చింది. రేపు ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాధారణంగా ఫ్యామిలీ, క్లాస్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే సుధీర్ బాబు, ఈసారి మాస్ యాక్షన్ పంథాలో ‘జటాధర’ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో, రాబోయే ఈ స్పెషల్ సాంగ్ సుధీర్ బాబులోని కొత్త ఎనర్జీని, డ్యాన్స్ మూమెంట్స్‌ను ఆవిష్కరించేలా ఉండబోతుందని చిత్ర బృందం హింట్ ఇచ్చింది. దీంతో ఈసారి అభిమానులకు మాస్ ట్రీట్ ఇవ్వనున్నట్టు అర్ధమవుతోంది.

సుధీర్ బాబు కొత్త అవతారం

‘జటాధర’ టైటిల్, పోస్టర్లను చూస్తేనే సినిమా పూర్తి యాక్షన్-ఓరియెంటెడ్‌గా ఉంటుందని అర్థమవుతోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో సుధీర్ బాబు మునుపెన్నడూ చూడని విధంగా మాస్ లుక్‌లో, ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త అప్‌డేట్, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా, వచ్చే నెల 7న జటాధర చిత్రం పాన్ ఇండియా వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.