తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక కల్ట్ క్లాసిక్ థియేటర్లలో మళ్లీ మతిపోగొట్టడానికి సిద్ధమవుతోంది! సంచలన దర్శకుడు, నటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఉపేంద్ర’ సినిమా గ్రాండ్ రీ-రిలీజ్ కోసం అంతా సిద్ధమైంది. తాజాగా, చిత్ర యూనిట్ ఈ రీ-రిలీజ్ కోసం ప్రత్యేకంగా కట్ చేసిన ట్రైలర్‌ను విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం హక్కులు మైత్రీ సంస్థ చేతికి
శ్రీనివాస ప్రొడక్షన్ బ్యానర్‌పై పాటి సుదేవ్ సమర్పిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 11న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా నైజాం ప్రాంత పంపిణీ హక్కులను అగ్ర పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకోవడం విశేషం.
‘మ్యాడ్ ఎక్స్‌పీరియన్స్’కు సిద్ధమవండి
‘నేను అనే పదం లేనప్పుడు, నేనే లేనప్పుడు… ఈ ప్రపంచమంతా నాదే’ అనే ఉపేంద్ర ఐకానిక్ డైలాగ్‌తో విడుదలైన ఈ కొత్త ట్రైలర్, నాటి ఉత్సాహాన్ని మళ్లీ నింపుతోంది. యూత్‌కు కొత్త అనుభూతిని, పాత ప్రేక్షకులకు నాస్టాల్జియాను అందించేందుకు ఈ గ్రాండ్ రీ-రిలీజ్ సిద్ధంగా ఉంది.
ఉప్పీ మార్క్ మేకింగ్, మైండ్ బెండింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అప్పట్లో షాక్‌కు గురిచేసిన ఈ సినిమాను మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఉపేంద్ర సృష్టించిన ఆ ‘మ్యాడ్ ఎక్స్‌పీరియన్స్’ కోసం థియేటర్లకు సిద్ధంగా ఉండండి!
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























