మిత్రమండలి ట్రైలర్ రిలీజ్

Mithra Mandali Trailer Released, Priyadarshi Promises a Laugh Riot

కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో, సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్‌ఎమ్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘మిత్రమండలి’. యూత్‌ఫుల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రబృందం నేడు డుదల చేసింది. ట్రైలర్‌ను చూస్తుంటే, నలుగురు అల్లరి స్నేహితులు (మిత్రమండలి) వారి సరదా జీవితంలో ఊహించని రాజకీయ నాయకుడితో చిక్కుకోవడం, ఆ తర్వాత తలెత్తే హాస్యం, గందరగోళం చుట్టూ కథ నడుస్తున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ హైలైట్స్..

  • జోష్ ఫుల్ కామెడీ: ప్రియదర్శి తన సహజమైన కామెడీ టైమింగ్‌తో మరోసారి కడుపుబ్బా నవ్వించేశాడు.
  • రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారని అర్ధమవుతోంది.
  • అలాగే వెన్నెల కిశోర్, సత్యల ట్రాక్ కూడా హిలేరియస్ గా ఉంది.
  • క్రికెట్ నేపథ్యం: ‘మిత్రమండలి’ కథను క్రికెట్ కామెంటరీతో పోల్చుతూ చెప్పిన వాయిస్ ఓవర్.. ట్రైలర్‌కు కొత్తదనాన్ని ఇచ్చింది.
  • నిహారిక ఎన్‌ఎమ్: ఇంటర్నేషనల్ సోషల్ మీడియా ఫేమ్ నిహారిక ఎన్‌ఎమ్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆమె ఒక బాక్సర్‌ పాత్రలో కనిపించనుంది.
  • మైత్రి – గందరగోళం: నలుగురు పనికిరాని స్నేహితులు ఒక శక్తిమంతమైన రాజకీయ నాయకుడితో ఎలా గొడవపడ్డారు, ఆ తర్వాత వారి జీవితాలు ఎంతటి హిలేరియస్ గందరగోళంలో చిక్కుకున్నాయనేది ట్రైలర్ స్పష్టం చేసింది.

విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్ తన కొత్త బ్యానర్ ‘బీవీ వర్క్స్’ పై సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై కల్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఆర్‌ఆర్ ధృవన్ సంగీతం అందించారు. ఈ చిత్రం అక్టోబర్ 16, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ పండగ సీజన్‌లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునేందుకు ‘మిత్రమండలి’ సరైన ఎంపిక అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.