కె ర్యాంప్ నుండి మరో అదిరిపోయే సాంగ్

KRamp Title Song to be Out Tomorrow

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘K-RAMP’ (కె-ర్యాంప్). యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు ప్రచార కార్యక్రమాలను ముమ్మురం చేస్తోంది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా, ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో, సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ మేరకు రేపు, అనగా.. అక్టోబర్ 7న దీనిని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, ఈ టైటిల్ ట్రాక్ పక్కా మాస్ బీట్‌తో, కిరణ్ అబ్బవరం ఎనర్జీకి తగ్గట్టుగా ఉంటుందని భావిస్తున్నారు.

జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుందని ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, ఈ టైటిల్ సాంగ్ ప్రమోషన్స్‌లో కీలక పాత్ర పోషిస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.