చిరంజీవి, వెంకటేష్‌ సహా 31 మందితో 80s స్టార్స్ రీయూనియన్‌

Megastar Chiranjeevi, Venkatesh, Jackie Shroff and 28 Other Celebs Gathered For The 80s Stars Reunion

దక్షిణ భారత సినిమా పరిశ్రమలో ప్రతి సంవత్సరం ఎంతో అద్భుతంగా జరిగే “80s Stars Reunion” అక్టోబర్‌ 4, 2025న చెన్నైలో జరిగింది. మూడు సంవత్సరాల విరామం తర్వాత జరిగిన ఈ సమావేశం, అందరికీ అద్భుతమైన ఎమోషనల్ మూమెంట్ గా నిలిచింది. ఇలా ప్రతి ఏడాది జరిగే ఈ “80s Stars Reunion” స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. కాగా, గతేడాదే నిర్వహించాలనుకున్నా, చెన్నైలో జరిగిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఆ రీయూనియన్‌ వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో ఈసారి ఆ వేడుక స్నేహం, ఐక్యత, హృదయపూర్వకమైన సమావేశం విజయవంతంగా జరిగింది. రాజ్‌కుమార్‌ సేతుపతి, శ్రీప్రియ దంపతులు తమ ఇంట్లోనే ఈ రీయూనియన్‌కు ఆతిథ్యం ఇచ్చారు. లిస్సీ లక్ష్మి (లిజి), పూర్ణిమ భాగ్యరాజ్‌, ఖుష్బూ సుందర్‌, సుహాసిని మణిరత్నం ఈ కార్యక్రమాన్ని కోఅర్దినేట్ చేశారు.

ఇంటి ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ సమావేశం, ఆ తారల మధ్య ఉన్న నిజమైన అనుబంధాన్ని ప్రతిబింబించింది. మొత్తం 31 మంది నటులు ఈ రీయూనియన్‌లో పాల్గొన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు హిందీ పరిశ్రమ నుండి కూడా స్టార్స్ వచ్చారు. సాయంత్రం అంతా నవ్వులు, జ్ఞాపకాలు, అనుభవాలు పంచుకుంటూ ఆత్మీయంగా గడిచింది.

ఇక 80s స్టార్స్ రీయూనియన్‌ గురించి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. “నా 80ల ప్రియమైన స్నేహితులతో ప్రతి సారి కలవడం అనేది నవ్వులు, ఆప్యాయత, ఇంకా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆ విడదీయరాని బంధంతో నిండిన ఓ మధురమైన జ్ఞాపకాల ప్రయాణం లాంటిది. ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నా, ప్రతి సమావేశం మొదటిసారి కలిసినట్టు తాజాగా అనిపిస్తుంది!” అని అందులో పేర్కొన్నారు.

రీయూనియన్‌కి హాజరైన స్టార్స్..

  • చిరంజీవి
  • వెంకటేష్
  • జాకీ ష్రాఫ్
  • శరత్‌కుమార్
  • రాజ్‌కుమార్ సేతుపతి
  • శ్రీప్రియ
  • నదియా
  • రాధ
  • సుహాషిని
  • రమ్య కృష్ణ
  • జయసుధ
  • సుమలత
  • రెహమాన్
  • ఖుష్బూ
  • భాగ్యరాజ్
  • పూర్ణిమా భాగ్యరాజ్
  • లిస్సీ
  • నరేష్
  • సురేష్
  • శోభన
  • మేనక
  • రేవతి
  • ప్రభు
  • జయరామ్
  • అశ్వతీ జయరామ్
  • సరిత
  • బాను చందర్
  • మీనా
  • లత
  • స్వప్న
  • జయశ్రీ
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.