డ్యూడ్.. హై-ఎనర్జీ ఫన్ ఫుల్‌గా ‘సింగారి’ సాంగ్

Dude's Third Gear Singari Out

వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా.. శరత్ కుమార్, రోహిణి మొల్లెటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ్యూజిక్ ప్రమోషన్‌లో భాగంగా రీసెంట్ గా విడుదలైన ‘బూమ్ బూమ్‌, బాగుండు పో’ సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే అన్ని భాషల యువతరంలో సాంగ్స్ పాపులర్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ‘సింగారి’ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను స్వయంగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరపరచి పాడారు.

అలాగే సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన ఆకట్టుకునే లిరిక్స్ సాంగ్ కి అదనపు ఉత్సాహం తీసుకొచ్చింది. ఫన్ ఫుల్ గా వినిపించే ఈ ట్రాక్‌ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇక ప్రదీప్ అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో సాగే సన్నివేశాలు పాటకు మరింత మజాను తెచ్చాయి. ఎనర్జిటిక్ బీట్స్, క్యాచి లిరిక్స్, యూత్ ఎనర్జీ ఈ సాంగ్ ని ఒక ఫన్ ప్యాకేజ్‌లా మార్చేశాయి.

మొత్తానికి సాయి అభ్యంకర్ తన ఫస్ట్ ఫీచర్‌ ఫిల్మ్‌ మ్యూజిక్ తోనే మంచి ఇంప్రెషన్‌ క్రియేట్‌ చేశాడు. కాగా, ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నికేత్ బొమ్మి, ఎడిటింగ్ రత్ విక్రమన్, ప్రొడక్షన్‌ డిజైనింగ్ లతా నాయుడు నిర్వహిస్తున్నారు. డ్యూడ్ అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.