వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ డ్యూడ్‌తో రానున్నాడు. పాన్ ఇండియా భాషల్లో విడుదలకానున్న ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటించగా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. రీసెంట్ గా విడుదలైన బూమ్ బూమ్, బాగుండు పో సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యూజిక్ ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ సింగారి సాంగ్ ని రిలీజ్ చేశారు.ఈ పాటను స్వయంగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరపరచి పాడారు.ఎనర్జిటిక్ బీట్స్, క్యాచి లిరిక్స్, యూత్ ఎనర్జీ ఈ సాంగ్ ని ఒక ఫన్ ప్యాకేజ్‌లా మార్చేశాయి.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఆకట్టుకునే లిరిక్స్ సాంగ్ కి అదనపు ఉత్సాహం తీసుకొచ్చింది.ఫన్ ఫుల్ గా వినిపించే ఈ ట్రాక్ అందరికీ కనెక్ట్ అవుతుంది.ప్రదీప్ అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో సాగే సన్నివేశాలు పాటకు మరింత మజాను తెచ్చాయి.సాయి అభ్యంకర్ తన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ మ్యూజిక్ తోనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు.ఇప్పటికే అన్ని భాషల యువతరంలో సాంగ్స్ పాపులర్ అవుతున్నాయి.డ్యూడ్ అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























