పేట్రియాట్ షూట్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న మ‌మ్ముట్టి

Mammootty Recovers, Joins Patriot Shoot in Hyderabad Tomorrow

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అభిమానులకు శుభవార్త! ఇటీవల అనారోగ్యంతో ఇబ్బంది పడిన ఆయన పూర్తిగా కోలుకున్నారు. అక్టోబర్ 1 నుండి, అనగా.. రేపటి నుంచి ఆయన హైదరాబాద్‌లో జరగనున్న ‘పేట్రియాట్’ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఇప్పుడు ఈ విషయం మమ్ముట్టి అభిమానులకు, సినీ వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది. కాగా, ఈ సినిమా మలయాళంలో అత్యంత భారీ మల్టీస్టారర్‌లలో ఒకటిగా తెరకెక్కుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ మల్టీస్టారర్‌గా ‘పేట్రియాట్’

ఇందులో మమ్ముట్టితో పాటు మరో సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా నటిస్తుండటం విశేషం. ఇంకా ఈ ఇద్దరు దిగ్గజాలతో పాటు, యంగ్ టాలెంటెడ్ నటులు ఫహద్ ఫాసిల్ మరియు కుంచాకో బోబన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తుండటం విశేషం. ‘సీ యూ సూన్, మాలిక్, అరియిప్పు, మలయంకుంజు’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను రూపొందించిన మహేష్ నారాయణన్ ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.

దక్షిణాదిలో ఇంత మంది స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో, ‘Patriot’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్ షెడ్యూల్‌లో ఈ నలుగురు స్టార్ల కాంబినేషన్ సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మమ్ముట్టి అనారోగ్యం నుంచి కోలుకుని, తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుండటం పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.