సుడిగాలి సుధీర్ కొత్త సినిమా లాంఛ్

Sudigali Sudheer’s Upcoming Film Officially Launched

సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ బుల్లితెర, వెండి తెర రెండింటిలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇక ఈ హీరో కొత్త చిత్రం ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి హైలెస్సో అనే ఆకట్టుకునే టైటిల్ పెట్టారు. ఇది పల్లె వాతావరణంలో తరచూ వినిపించే మాట నుంచి తీసుకోవడం విశేషం. టైటిల్ పోస్టర్‌ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమా లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. హీరో నిఖిల్ టైటిల్‌ను లాంచ్ చేశారు. బన్నీ వాసు స్క్రిప్ట్‌ను అందజేశారు. దర్శకులు వశిష్ట, చందూ మొండేటి, మెహర్ రమేశ్ కెమెరాను ఆన్ చేయగా, ముహూర్తపు షాట్‌కు వి.వి. వినాయక్ క్లాప్ కొట్టారు. దర్శకుడు ప్రసన్న కుమార్ స్వయంగా యాక్షన్ చెప్పారు.

ఈ సినిమాలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ కన్నడ నటి అక్షర గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.యంగ్ అండ్ టాలెంటెడ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. అనుదీప్ దేవ్ సంగీతం అందించగా, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌గా చోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌ బ్రహ్మ కడలి, చింతా శ్రీనివాస్ రైటర్. హై లెస్సో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.