భారీ అంచనాల మధ్య గత గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతుంది.మొదటి మూడు రోజులు అదరగొట్టిన ఈసినిమా ఆదివారం కూడా సాలిడ్ హోల్డ్ కొనసాగించింది.దాంతో 250కోట్ల క్లబ్ లో చేరింది. నాలుగు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 252 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ ప్రకటించారు.అయితే నిన్న ఇండియా -పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగగా ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఓజీ నైట్ షోస్ పై పడింది.లేకుంటే వసూళ్లు ఇంకా పెరిగేవే.ఇక ఈరోజు నుండి ఈసినిమా ఎలా పెర్ఫర్మ్ చేస్తుందో చూడాలి.దసరా సెలవుల్లో విడుదలకావడం ఓజీ అడ్వాంటేజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అటు ఓవర్సీస్ లో ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.నార్త్ అమెరికాలో అయితే 5 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. పవన్ కెరీర్ లోనే ఓజీ హైయెస్ట్ గ్రాసర్ మూవీ గా ఘనత సాధించింది.
గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ ,శ్రీయా రెడ్డి , అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించారు.బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్ గా నటించాడు. తమన్ సంగీతం అందించగా డివివి దానయ్య ,కళ్యాణ్ దాసరి నిర్మించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























