తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం డైరెక్టర్ సుజీత్ పేరు మారుమోగుతుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా తెరకెక్కించడమే అందుకు కారణం. నిన్న విడుదలైన ఈసినిమా థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇంతకుముందు పవన్ ఎవరు చూపించని విధంగా చూపించి పవన్ ఫ్యాన్స్ తో ప్రశంసలు అందుకుంటున్నాడు సుజీత్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో భాగంగా సుజీత్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. సాహో తరువాత రామ్ చరణ్ తో లండన్ బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ స్టోరీ తో సినిమా చేయాలని అనుకున్నాను కానీ కోవిడ్ వల్ల అది సాధ్యం అవ్వలేదు. ఆ తరువాత ముంబైకి వెళ్లి బాలీవుడ్ లో ఓ పెద్ద హీరో తో సినిమా ప్లాన్ చేశాను. సినిమా కూడా ఓకే అయ్యింది.
ఇంకో 4 నెలల్లో ఆ సినిమా స్టార్ట్ అవుతుందనగా నిర్మాత దానయ్య గారు అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ గారి దగ్గరనుండి ఫోన్ వచ్చింది. ఇలా పవన్ కళ్యాణ్ తో సినిమా అనుకుంటున్నాం. మీరు డైరెక్ట్ చేయాలనీ అడిగారు. ఇక ఆ ఆఫర్ వచ్చాక ఆలోచించాను. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నే కానీ సరిగ్గా తీయగలనా లేదా అని.సరే ట్రై చేద్దాం అని రెడీ అయ్యి బాలీవుడ్ ఛాన్స్ కాదనుకొని పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఒప్పుకున్నాను. అలా ఓజీ వచ్చిందని సుజీత్ చెప్పుకొచ్చాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























